ఎమ్మెల్యే కిషోర్, అద్దంకి ల దగ్గర డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే!

ఎమ్మెల్యే కిషోర్, అద్దంకి ల దగ్గర డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి రవి.

తుంగతుర్తి ఆగస్టు 8 నిజం న్యూస్

గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ ల దగ్గర డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి రవి అన్నారు.

ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కోమటిరెడ్డి బ్రదర్స్ బిజెపి కి వెళ్ళిన తనకు సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీలో ఉండి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లో పాలుపంచుకుంటా నని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ వచ్చినా, రాకున్నా, టికెట్ వచ్చిన వ్యక్తి తో కలిసి పని చేస్తానని అన్నారు. కొంతమంది నాయకులు ఎమ్మెల్యే కిషోర్, అద్దంకి ల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, నిరూపిస్తే ఎక్కడికైనా వస్తానని సవాల్ విసిరారు.. అనంతరం ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జి. నరేందర్, గుణ గంటి రమేష్, డేగ వత్తు రవి నాయక్, వినోదు లింగయ్య ,సాయి రమణ, నరేష్ ,చింటూ విక్రమ్ మనోహర్ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.