Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏజెన్సిలో ఆదివాసి చట్టాలకు తూట్లు

ఏజెన్సీలో 1/59,1/70 ,ఎల్ టి ఆర్,పెసా చట్టాలు ఉన్నట్టా లేనట్టా..

ఆదివాసి చట్టాలకు ఆదివాసి అస్తిత్వానికి రక్షణ ఎవరు..

చట్టాలకు రక్షణ కల్పించవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరు. రక్షించేది ఎవరు…

అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు.. అధికారులేం చేస్తున్నారు…!

జీలుగమిల్లి ఆగస్టు 5 (నిజం న్యూస్)

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలోని ఎక్కడ చూసినా రెండంతస్తుల అక్రమ భవనాల కట్టడాలు జోరుగా జరుగుతున్నాయి.

1/59 1/70 చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు భూములు, క్రయ, విక్రయాలు, బహుళ అంతస్థుల నిర్మాణాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. గిరిజనేతరులు పంట పొలాలను ఇల్లా స్థలాలుగా ఏర్పాట్లు చేసి వాటిని అధిక మొత్తంలో క్రయ, విక్రయాలు జరువుతున్నారు.

అసలు ఏజెన్సీలో రెండంతస్తుల కు అనుమతులు లేవు… కానీ కొంతమంది వ్యాపారస్తులు అధికారులను రాజకీయ నాయకులను మచ్చిక చేసుకొని ఏజెన్సీలో రెండు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు.

మండలంలోని ఎక్కడ చూసినా రెండు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. అంటే సంబంధిత అధికారులు వ్యాపారస్తులు ఇచ్చే ముడుపులకు లొంగి పోవడం వల్ల భవన నిర్మాణాల కట్టడాలు అధికంగా జరుగుతున్నాయని ఆదివాసి సంఘాలు ఆరోపిస్తున్నారు. ఇలా అక్రమ నిర్మాణం చేసిన వారిపై పంచాయతీ అధికారులు తనిఖీలు చేసి అక్రమ నిర్మాణం కింద నోటీసు ఇవ్వాలి. కానీ అక్రమ నిర్మాణాలు చేపట్టే వారికి నోటీసులు ఇవ్వకుండానే వారితో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు ఏజెన్సీలో అధికారుల అండదండగా ఉంటున్నారని ఏజెన్సీ ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జోరుగా జరుగుతున్న పట్టించుకున్న అధికారులు లేరని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు అక్రమభవన నిర్మాణాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు పలు ప్రజా సంఘాలు నాయకులు కోరుతున్నారు.

ఏజెన్సీ లో గిరిజన చట్టాలు ఏంచేపుతున్నాయో చూదాం…

*పీసా చట్టం…..*

భారత రాజ్యంగం 73వ సవరణ చట్టం 1992 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్థానిక పంచాయతీల ద్వారా స్వపరిపాలనకు కావలసిన అధికారులు బదీలీ చేయడం అయితే షెడ్యూలు ప్రాంతాలలో స్వపరిపాలన తరతరాలుగా వారి సంస్కృతిలో ముఖ్యభాగమైంది కులపంచాయితీలు గ్రామపంచాయితీలు ప్రాంతీయ పంచాయతీలు కూడ ఉన్నాయి అయితే ఇవి వారి సామాజిక వ్వవహరాలు నిర్వహించడంలో పటిష్టంగానే ఉన్నాయి అయితే బయట సమాజంతో ఉత్పన్నమయ్యే సందర్భాలలో ఆదివాసీ గ్రామపంచాయితీలు పనిచేయలేకపోతున్నాయి

ఎందుకంటే ఆదివాసులవి సాంప్రదాయిక న్యాయం మౌఖికమైన చట్టం దీనికి బయటి ప్రపంచంలో గుర్తింపు లేదు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పంచాయతీరాజ్ చట్టం షెడ్యూలు ప్రాంతాలకు వర్తించేముందు ఇక్కడ పంచాయతీలకు ఏమేమి ప్రత్యేక అధికారాలు ఇవ్వాలి అనేది ప్రత్యేకంగా నిర్వచించాలి

శ్రీ దిలీప్ సింగ్ భూరియ గారి నాయకత్వంలో ఒక కమిటీని జూన్ 10 1994 కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ది శాఖ నియమించింది వారి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 1996 యాక్ట్ 40 ద్వారా పంచాయతీరాజ్ షెడ్యూలు ప్రాంతాలకు విస్తరింపు చట్టంను చేసింది అయితే కేంద్ర ప్రభుత్వం కోంత వేసులుబాటు కల్పించింది ఇంక ఆధికార వికేంద్రీకరణ కోరకు రాష్ట్ర ప్రభుత్వం జరగాలని భావిస్తే మార్పులు చేర్పులు చేయవచ్చు అన్ని అవకాశం కల్పించింది

కాని మన  రాష్ట్రప్రభుత్వం అధికారన్నీ వ్యతిరేక దశలో వినియోగించింది ఆంద్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1998 తేచ్చింది ఈ చట్టం ప్రకారం భూఖనిజ వనరులను మేజర్ మైనర్ మీనరల్స్ గా విభజించి మైనర్ మీనరల్స్ అయిన ఇసుక గ్రానైట్ గ్రామపంచాయితీ తగదలు చిన్న చిన్న అంశాలపై ఆదివాసులకు అధికారాలు కల్పించినది అయితే మేజర్ మినరల్స్ అయిన బొగ్గు సిమేంట్ ఇసుక మొదలగు వాటిపై అధికారాలను రాష్ట్రప్రభుత్వం లాక్కోంది

భూరియ కమిటీ సిప్పారుసులను కేంద్ర చట్టంలో   చేర్చలేదు కేంద్ర చట్టంలో ఉన్న అంశాలు రాష్ట్రప్రభుత్వం చట్టంలో లేవు 1998 ఆంద్రప్రదేశ్ పీసా చట్టం వస్తే అములు జరిపే విధివిదానాలను తెలిపె రూల్సు మాత్రం 2011 రూపోందించారు   అంటే 13 సంవత్సరాల తరువాత వచ్చాయి జీవో 66.పంచాయతీరాజ్ పీసా స్సూర్తికి అనుకుణంగా లేదు

1998 నుండి 2011 మధ్యలో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి కాని పీసా చట్టం యొక్క విధివిదానాలు రూపోందించలేదు మన రాష్ట్రప్రభుత్వలకు ఆదివాసులపైన ఎంత ప్రేమ ఉందో ఇక్కడే అర్థమవుతుంది

*పీసా చట్టంలోనీ అంశాలు…*

242(A)1 ప్రకారం ఈ చట్టం రాష్ట్రంలోని షెడ్యూలు ప్రాంతాలలోని గ్రామపంచాయితీలు మండల పరిషత్ లు జిల్లా పరిషత్తులకు వర్తిస్తుంది

(2) మరే చట్టంలోనీ ప్రోవిజన్లు ఈ చట్టంలోనీ ప్రోవిజన్లకు విరుద్ధంగా ఉంటే ఈ చట్టంలోనీ ప్రోవిజన్లదే పై చేయి

242(B} ప్రకారం గ్రామం అంటే అవాసము లేక అవాసాల గుంపు హెమ్లేట్ గూడెలు దాంట్లో ఒక తెగ కాని కొన్ని తెగాలు కాని కాలసియుండి వారి  ఆచారారల  ప్రకారం నడిపించుకునే విదానాలు ఉండాలి

242(c} 1 ప్రకారం ప్రజల యొక్క ఆచారాలను సాంస్కృతిక సామాజిక ఆస్తిని సాంప్రదాయికంగా తగవులు తీర్చుకునే విధామును కాపాడేందుకు కోనసాగించేందుకు ప్రతి గ్రామసభకు అధికారాలున్నాయి

242(c} 2 ప్రకారం గ్రామపంచాయితీ పరిధిలో సామాజిక ఆర్థికాభివృద్దిపై తయారు చేసే ప్రణాళికాలు పథాకాలు ప్రాజేక్టులను వాటి అములుకు ముందే గ్రామసభ తప్పకుండా అమోదించాలి

ఈ విధంగా జరిగియుంటే ఆసిఫాభాద్ లోని దేవాయిగూడ చందుగూడ ఉల్లీపిట్ట డోర్లీ స్మాసనాలుగా మార్పు చేందేవికావు పేరుకు చట్టాలు చేసేది మాత్రం ప్రభుత్వమే ఈ మధ్యకాలంలో ఆదివాసులు కోన్ని తీర్మానాలు చేసి వివిధ శాఖ ఉద్యోగుస్తులను భహిష్కరిస్తున్నారు ప్రభుత్వలు పీసాను గౌరవించాలి

242 (f} ప్రకారం షెడ్యూలు ప్రాంతాలలో అభివృద్ధి ప్రాజేక్టులు చేపట్టేందుకు భూసేకరణ చేసే ముందు మండల పరిషత్ ను తప్పకుండా సంప్రాదించాలి ఇక్కడ సంప్రదింపులు అంటే అమోధము అనీ కూడ అర్థం

242(H ) ప్రకారం చిన్న తరహ ఖనిజాల పరిశీలన ఏవరికైనా గ్రాంట్ చేసేందుకు వేలికితీతకు గ్రామ సభ అమోదం పోందాలి

242(1) 1 ప్రకారం పంచాయతీ కాని గ్రామసభ కాని ఈ క్రింది అధికారాలు లభిస్తున్నాయి

a మత్తు పదార్థాల అమ్మకం సేవించడంపై నిషేధం క్రమబద్దీకరణ లేక నియంత్రణ

b చిన్న తరహ అటవీ పలసాయంపై ఆస్తి హక్కు

c భూమి బదలాయింపును నిరోదించుట చట్టవిరుద్దంగా అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ఇప్పించడం ఈ పెసా చట్టం చెపుతుంది.

*ఏజెన్సీ లో గిరిజనులకే సంపూర్ణ హక్కులు….*

ఏజెన్సీ ఏరియాగా గుర్తించిన ప్రాంతంలో  1/70 చట్టం ప్రకారం  గిరిజనులకు మాత్రమే భూములపై సంపూర్ణ హక్కులు ఉంటాయి. ఆ భూములు గిరిజనేతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించడం కానీ, హక్కులు కల్పించడం కానీ చేయకూడదు. ఒక వేళ గిరిజనులు వ్యక్తిగత అవసరా నిమిత్తం భూములు విక్రయించాల్సి వచ్చినా గిరిజనులకు మాత్రమే అమ్మ జూపాలి. లేదా ప్రభుత్వానికి విక్రయించాలి. తిరిగి ప్రభుత్వం సదరు భూములను గిరిజనులకు తప్పా ఇతర వర్గాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ హక్కులు కల్పించకూడదు. ప్రజాప్రయోజనాల రీత్యా భూమి అవసరమైతే సంబంధిత గ్రామ పంచాయతీలలో గ్రామసభ ద్వారా తీర్మానం చేసి మాత్రమే అక్కడ గిరిజనేతరులకు లేదా ప్రభుత్వానికి భూమిని ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ గిరిజనేతరులు ఆయా స్థలాలను ఆక్రమించినా, కొనుగోలు చేసినా అధికారికంగా వారికి ఎలాంటి హక్కులు ఉండవు.

అదే సమయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతూ పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలకు 1/70 చట్టం అమలును బాధ్యతలను అప్పగించారు. దీన్ని సదరు సంస్థలు పట్టించుకోక పోవడంతో అక్రమార్కులు క్రయవిక్రయాలు జరుపుతూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేపట్టి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

*మోడియం శ్రీనివాస రావు ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్.*

*అధికారుల నిర్లక్ష్యానికి గిరిజనులు బలవుతున్నారు.*

ఏజెన్సీ ప్రాంతమైన జీలుగుమిల్లి మండల కేంద్రంలో గిరిజన చట్టాలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతూన్న అధికారులు ఏ మాత్రం పటించుకోవడం లేదు.గిరిజనుల చట్టాలను కాపాడలని అన్నిసారులు ఉన్నత అధికారులాకు విన్నమించుకున్న గాని ఫలితం లేకుండా పోయింది.

*తెల్లం దుర్గారావు సీపీయం మండల కార్యదర్శి. *అమలుకాని గిరిజన చట్టాలు…*

అంతో ప్రతిష్టమకమైన గిరిజన చట్టాలు ఏజెన్సీ ప్రాంతమైన జీలుగుమిల్లి మండల కేంద్రంలో అమలు కావడం లేదు.అంతో విలువైనటువంటి వ్యవసాయ భూములను ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా క్రయ విక్రయాలు జరుపుతున్నారు. వ్యవసాయ భూములను వెంచర్లు నిర్మించి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలు నిర్మించి అనేక వ్యాపారాలు పేరుతొ అమాయక గిజనులను మోసంచేసి గిరిజనుల జీవమనుగడను దెబ్బదీస్తున్నరు.