మంత్రి కబ్జాలతోటే నిర్మలకు నీళ్ల గండం.

నిర్మల్ జిల్లా స్టాఫర్,  నిజం న్యూస్ (ఆగస్టు-4)

ఏలేటి మహేశ్వర రెడ్డి ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్

డెబ్బై ఎనభై ఏళ్ల నుంచి రాని వరద నీళ్ళు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి.

చిన్న వర్షానికే నిర్మల్ పట్టణం నీట మునిగిపోతుంది.

చెరువులు, నాళాలను కబ్జాలు చేయడంతోనే సమస్య.

నిర్మల్ అంటేనే వాన నీళ్ళు అనే పరిస్థితి వచ్చింది.

ప్రజలంతా వరదలతో ఇబ్బంది పడుతున్నా.. మంత్రి మాత్రం కబ్జాలు అపడం లేదు.

తాజాగా పట్టణంలోని సోఫీ నగర్ లో ఇబ్రహీం చెరువు నాళాను కబ్జా చేసి, ఇండస్ట్రియల్ ఏరియా లో 8 ఎకరాల భూమి కబ్జా చేశారు, ఇప్పుడు చెరువులోని నీరంతా రోడ్లపైకి వస్తోందని చెప్పారు,

భూముల కబ్జాలు, అభివృద్ధి మీద ఎన్ని సార్లు బహిరంగ చర్చకు సవాల్ చేసిన మంత్రి స్వీకరించడం లేదంటే కబ్జాలను ఒప్పుకున్నట్లేనని తెలిపారు.