లావణ్య కు గురుకులంలో సీటు ఇచ్చారు

భూక్య లావణ్య సీటు కోసం ఎమ్మెల్యే కృషి పట్ల సర్వత్రా హర్షం

పేద గిరిజన లావణ్య కుటుంబం ఎమ్మెల్యే సహకారాన్ని మరువలేరు.

సూర్యాపేట ప్రతినిధి, ఆగస్టు 4 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల ప్రయోజనాల కోసం గురుకులాల ను ఏర్పాటు చేసి, గురుకుల ప్రవేశ పరీక్షల్లో పాసైన విద్యార్థులకు, ఎటువంటి పారదర్శకం లేకుండా పేద గిరిజన విద్యార్థులు సీటు పొందుతున్న తరుణంలో, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో భూక్య లావణ్య కు సదరు ప్రిన్సిపాల్ దుర్గ భవాని నిర్లక్ష్యంతో సీటు కోల్పోగా, లావణ్య తోపాటు తల్లిదండ్రులు స్థానిక విలేకరులను ఆశ్రయించగా, జరిగిన సంఘటన ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకు పోగా, ఆగ్రహంతో దూషించి వెళ్లగొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనతో బాధపడ్డ పేద గిరిజన లావణ్య కుటుంబ సభ్యులు తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్. గాదరి కిషోర్ కుమార్ ను ఆశ్రయించారు. దీనితో జరిగిన సంఘటన పూర్తిగా వెల్లడించారు. తక్షణమే సంబంధిత గురుకుల సొసైటీ అధికారులతో మాట్లాడి, తిరిగి గురుకులంలో సీటు వచ్చే విధంగా కృషి చేశారు. దీనితో ఆ పేద గిరిజన కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తిరిగి గురుకులంలో సీటు వచ్చినట్లు తెలిపినట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా పేద గిరిజన కుటుంబానికి ఎమ్మెల్యే చేసిన సహకారం పట్ల లావణ్య కుటుంబ సభ్యులతో పాటు, స్థానిక గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.