ఇర్విన్ ను కొత్త మండలంగా ఏర్పాటు చేయండి

మాడ్గుల ఆగష్టు 3 (నిజం న్యూస్ ): మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామపంచాయతీని మండల కేంద్రం ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అధికారులు సరియైన వివరాలు ఇవ్వక పోవడం వలన మండల కేంద్రం ఏర్పడక పోవడానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి ఇర్విన్ గ్రామ పంచాయతీకి అతి సమీపంలో, 7 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి కలకొండ ఎంపీటీసీ స్థానం, గిరి కొత్తపల్లి ఎంపీటీసీ స్థానం, అందుగుల ఎంపీటీసీ స్థానం, ఆర్కపల్లి ఎంపీటీసీ స్థానం, బ్రాహ్మణపల్లి ఎంపీటీసీ స్థానం, సుద్ధపల్లి ఎంపిటిసి స్థానం, ఇర్విన్ ఎంపీటీసీ స్థానం, ఇన్ని ఎంపీటీసీ స్థానాలు అతిసమీపంలో ఉన్నప్పటికీ అదేవిధంగా 15 గ్రామ పంచాయతీలు అతి సమీపంలో ఉన్నాయి అదేవిధంగా వీటి పరిధిలో 30 వేల జనాభా కూడా ఉంది అయినప్పటికీ మండల కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు ఇష్టం లేదో ఇర్విన్ సమీపంలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రజలకు ప్రజాక్షేత్రంలో అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ వివరించాలని వివిధ గ్రామ పంచాయతీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఇర్విన్ మండల కేంద్రం చేయడానికి సరి అయిన నివేదిక సమర్పించి ఇర్విన్ మండల కేంద్రం ఏర్పాటు అయ్యేవిధంగా అధికారులు కృషి చేయాలని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు.