ప్రేమోన్మాది ఘాతకం.. కారుతో ఢీ కొట్టి

కళ్యాణదుర్గం ఆగస్టు 3 (నిజం న్యూస్)

పెళ్ళి చేసుకోవాలని యువతికి వేధింపులు.. లేకుంటే చంపేస్తానని బెదిరింపు..

యువతి నిరాకరించడంతో హత్యాయత్నం.. ఇద్దరిది ఒకే గ్రామం.యువతికి కి యువకుడికి అన్న వరస.

పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు..

పోలీసుల అదుపులో నిందితుడు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద స్కూటీ కారు ఢీ కొన్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది ప్రమాదంలో యువతి తలకి,కాలికి తీవ్రగాయాలు అయ్యాయి స్థానికులు కళ్యాణదుర్గంప్రభుత్వాసుపత్రికి తరలించారు,పట్టణంలోని గుండ్లప్ప దొడ్డి కాలానికి చెందిన గుజ్జల మైతిలి గా పోలీసులు గుర్తించారు యువతి వ్యక్తిగత పనుల నిమిత్తం కంబదూరు వైపు వెళ్లి కళ్యాణదుర్గం కి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో  స్కూటిని  వెనక నుండి కారు ఢీ కొనట్లు స్థానికులు తెలిపారు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు,కారు డ్రైవర్ గుజ్జల భాస్కర్  ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి డ్రైవర్ ను పోలీసులు అన్నికోణాల్లో విచారించగా హత్యాయత్నం కు పాల్పడ్డాడని నిర్దారించి కేసునమోదు.

పోలీసులు దర్యాప్తులో వెలుగుచూసిన మరో కోణం..

ప్రియురాలిది ప్రియుడి ది ఒకే గ్రామం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం అమ్మవారి పేటకు చెందిన వారుగా సమాచారం. మైతిలి తల్లి సువర్ణమ్మ కళ్యాణదుర్గం పట్టణంలో పోస్ట్ మాన్ గా విధులు నిర్వహిస్తోంది గత కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త మృతి, భర్త ఉద్యోగం భార్యకు వచ్చింది, వారికి కూతురు మైతిలి తో పాటు ఒక కొడుకు ఉన్నారు ఇంటర్ చదివిన కూతురు మైథిలి తో జీవనం సాగిస్తోంది.

అమ్మవారిపేట లో నివాసం ఉన్నసమయంలో ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన భాస్కర్ అనే యువకుడు మైథిలి ని వేధించేవాడు. ఇటీవల ఉద్యోగ బదిలీల్లో భాగంగా గత ఆరునెలల నుంచి తల్లి తో పాటు కళ్యాణదుర్గం లో నివాసం ఉండేది.

పథకం ప్రకారమే హత్యాయత్నానికి ఒడిగట్టాడు మైథిలి కళ్యాణదుర్గం చేరుకున్న తర్వాత ప్రియుడు గుజ్జల భాస్కర్ కు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్న భాస్కర్ హత్య చేయాలని అనుకున్నాడు.