గిరిజన గురుకులంలో సీటు లేదని వెళ్లగొట్టారు !

గిరిజన గురు కులంలో విద్యార్థికి సీటు రాకపాయె బాధ్యులెవరు??

కష్టపడి చదివి గురుకుల సీటుకు అర్హులైన భూక్య లావణ్య విద్యార్థిని సీటు లేదని వెళ్లగొట్టిన వైనం.

గిరిజన గురుకుల ప్రిన్సిపాల్ దుర్గ భవాని ఇష్ట రాజ్యమేనా.

తుంగతుర్తి ఆగస్టు3 నిజం న్యూస్

గురుకుల సీటు కోసం ఆరు కాలం కష్టపడి చదివి 5 వ తరగతి ప్రవేశ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన భూక్య లావణ్య కి గిరిజన గురుకులంలో సీటు లేదని చెప్పడంతో ఆవేదనకు గురైన సంఘటన , తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఆలస్యంగా చోటు చేసుకుంది.

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం …తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష కోసం కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి భూక్య లావణ్య తీరా ప్రవేశం కొరకు తల్లిదండ్రులైన శంకర్ ఇందిర లు పోతే ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఈ రోజు ప్రిన్సిపాల్కు తీరిక లేదని పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఒకరు చెప్పడంతో ఆ విద్యార్థిని వెను తిరిగి పోయింది. నూతన అడ్మిషన్ కోసం వస్తున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఇష్టారాజ్యం తో ప్రవర్తించడం బాధాకరమైన విషయం. తిరిగి మంగళవారం రోజున రావడంతో నిన్ననే మీ సీటు అయిపోయింది చెప్పడం ఆమె అవివేకానికి నిదర్శనం.

 

ఈ రోజు లేదు అని చెప్పడంతో వారు ఆవేదనతో కన్నీరుమున్నీరు ఐ, స్థానిక విలేకరులను ఆశ్రయించడం జరిగింది. విలేకరులు సర్ది చెప్పకపోగా వారి పైన దూషించడం తో వారు తిరిగి వెళ్లిపోయారు. జరిగిన సంఘటన తల్లిదండ్రుల కమిటీ సభ్యులు గురుకుల సొసైటీ చైర్మన్ రోనాల్డ్ రో స్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు

. తక్షణమే గురుకుల జిల్లా ఇన్చార్జి జరిగిన సంఘటనపై విచారణ జరిపి, పేద విద్యార్థి భూక్యా లావణ్య కు తక్షణమే సీటును మంజూరు చేసే విధంగా కృషి చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు