Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సింగరేణి వదిలేసింది ?

– సింగరేణి వాసుల ఆవేదన

– బాంబుల మోత..

– నెర్రలిచ్చిన స్లాబులు.. పెచ్చులూడిన గోడలు

– కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లు

– బిక్కుబిక్కుమంటున్న కాలనీ వాసులు

– సత్తుపల్లి మున్సిపాలిటీలోని కాలనీవాసులు సింగరేణి ప్రభావిత ప్రాంత వాసులు కావటం తో సింగరేణి బాంబుల మోతకు కాలనీలోని ఇళ్లు దద్దరిల్లుతున్నాయి. దీంతో వర్షాలకు ఇళ్లు కురుస్తుండటంతో గోడలు పగుళ్లు వచ్చి ఎప్పుడు కూలుతాయోనని భయం.. భయం గా కాలం వెల్లదీస్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా తమగోడును పరిష్కరించాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

సత్తుపల్లి జూలై 30(నిజం న్యూస్)

 

నెర్రలిచ్చిన గోడలు,పెచ్చులూడిన శ్లాబులు,కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లు…. ఇది సత్తుపల్లి మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ నగర్, వెంగళ రావునగర్ కాలనీ వాసుల దుస్థితి.

 

*బొగ్గుగనుల విస్తరణతో*..

 

సత్తుపల్లి పట్టణాన్ని ఆనుకొని 2005 నుంచి సింగ రేణి ఓపెన్ కాస్టు బొగ్గు గనుల తవ్వకాలు చేప ట్టారు. వెంగళరావునగర్ కాలనీకి సమీపం నుంచి జేవీఆర్ ఓసీ-1 బొగ్గు తవ్వకాలు చేయగా ఎన్టీఆర్ నగర్ దగ్గరగా జేవీ ఆర్ ఓసీ-2 బొగ్గు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ కాలనీల్లో సుమారు 1,400 ఇళ్లు ఉన్నాయి. బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి సంస్థ ప్రతిరోజు బాంబ్ బ్లాస్టింగ్లు చేస్తుంది. దీని ప్రభావంతో కాలనీవాసులు ఇళ్లు కదిలి దెబ్బతింటున్నాయి. కాలనీ వాసులకు న్యాయం చేయాలని కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నారు.

 

*భయం.. భయంగా*..

 

సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ తో కాలనీలోని ఇళ్ల గోడలు నెర్రలు ఇవ్వడంతో వానొస్తే ఇళ్లునాని ఇప్పుడు కూలుతాయోనని భయం.. భయంగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల వెంగళరావునగర్ కాలనీలో వరికూటి సుధాకర్ ఇం టి శ్లాబు పోటు కర్రలు పెట్టినప్పటికీ కూలిపో యింది. ఎన్టీఆర్ కాలనీ లోను గోడలు పడిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడపాల్సి వస్తోంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉండాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని కంటిమీద కునుకు పడటం లేదని లబోదిబోమంటున్నారు. వర్షాలకు కురుస్తుండటంతో ఇళ్లపై పరదాలు కప్పుకొని ఉం టున్నామని.. కానీ ఇళ్లు ఎప్పుడు కులుతాయోనని భయంతో ఆరుబయటే ఉండాల్సి వస్తోందని వాపో తున్నారు. ఇప్పటికైన సింగరేణి అధికారులు మా గోడును పట్టించుకోవాలని కోరుతున్నారు.