శ్రీను ఇదిగో నీ బిడ్డకు కల్యాణలక్ష్మీ చెక్కు ఇస్తున్నం

పార్టీల అతీతంగా గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు
ఇప్పడైన మా ప్రభుత్వాన్ని తిట్టకురా..
రాజన్నసిరిసిల్ల జిల్లాలో బిజెపి నేత కూతురుకు కళ్యాణ లక్ష్మి చెక్కును ఇంటికెళ్లి ఇచ్చిన టీఆర్ఎస్ నేతలు.
హైదరాబాద్ ఆగస్టు 1నిజం న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ లో బిజెపి నేత పొన్నం శ్రీనివాస్ గౌడ్ కూతరుకు కళ్యాణ లక్ష్మి చెక్కు తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ లీడర్లు ,ఇంటికి వెళ్లి మరి ఇచ్చి వచ్చారు. ఉదయం లేస్తే టీఆర్ఎస్ తీరుపై,, కేటీఆర్‌పై విమర్శలు చేసే బీజేపి నేత పొన్నం శ్రీనివాస్ కూతురు వివాహం ఇటీవలే జరుగగా, శ్రీనివాస్ భార్య వాణి పేరిట ,కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116/- లు మంజూరైంది. ఈ చెక్కును లోకల టీఆర్ఎస్ లీడర్లు కర్నె బాలయ్య, రాంరెడ్డిలు వెళ్లి ఇచ్చి వచ్చారు. ఆరేయ్ సీను ఇప్పటికైన మా ప్రభుత్వాన్ని తిట్టుడు బంద్ జేయ్రా అని (నవ్వుతూ) .. చెక్కు ఇవ్వగా బీజేపి నేత ఇంటికి వచ్చిన టీఆర్ఎస్ నేతలకు స్వీట్ తినిపించి తన బిడ్డకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు.
ఇది ఏదో బీజేపి నేతకు టీఆర్ఎస్ సర్కార్పెద్ద సాయం చేసిందని కాదు కానీ.. పార్టీలకతీతంగా గిట్ల సంక్షేమ ఫలాలు అందాలి. నా ,తన అనే బేధం ఉండోద్దు. గ్రామాల్లో రాజకీయాలు కూడా ఇలా ప్రేమపూర్వకంగా ఉండాలి. శ్రీనివాస్ తన పార్టీ లైన్లో ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు కానీ.. ఇంటికి వచ్చిన నేతలను నేతలకు గౌరవించి.. మర్యాద ఇచ్చి స్వీట్లు తినిపించి.. ఛాయ్ పోసి పంపాడు.
పల్లెల్లో పార్టీలకు అతీతంగా పథకాలే కాదు..ప్రేమా అప్యాయతలు ఇలానే ఉండాలి.. రాజకీయాలు ఎప్పుడు శాశ్వాతం కాదు..మన మంచితనం.. స్నేహపూర్వక వాతవరణం ఎప్పటికైన
మంచిదని తెలియజేసే విషయం గా చెప్పుకోవచ్చు…