Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడే ప్రసక్తే లేదు

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.

తుంగతుర్తి, జూలై 31 నిజం న్యూస్

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని టి పి సి సి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి వీఆర్ఏల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలుపుతూ, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు చాలీచాలని వేతనాలతో జీవనోపాధి సాగిస్తున్నారని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు ప్రక్కన పెట్టి, పబ్బం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏ సమస్యల పరిష్కారం కోసం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తో మాట్లాడి, పరిష్కరించుటకు కృషి చేస్తామని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపి పార్టీ తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని, రాజగోపాల్ రెడ్డి నీ ఆర్థికపరంగా ఇబ్బందులకు గురి చేయాలని ,పార్టీ వీడుతున్నట్లు కావాలని ,మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ,ఎంపీలపై ఈ డి కేసులో అక్రమంగా పేర్లు పెడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , అమీషా లు కుట్రలు పడుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో అవినీతి ఊబిలో కోట్ల రూపాయలు కూడబెట్టిన టిఆర్ఎస్ మంత్రులను ఎమ్మెల్యేలను, ఎంపీలను వదిలిపెట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఈడీ కేసు పెట్టడం నీచమైన చర్య అన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై వస్తున్న విమర్శలను, నాయకులు, ప్రజలు పట్టించుకోవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితం నడుస్తుందని అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో తాను ఎల్లవేళల నాయకులకు అందుబాటులో ఉంటానన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిక్కి శ్రీను, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఓబిసి ఉపాధ్యక్షుడు అక్కినపల్లి రమేష్, అనిల్, వెంకన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.