ఇల్లందులో మహిళలను,మహిళా ప్రజా ప్రతినిధులను లైంగికoగా వేదిస్తున్న గులాబీ నేతలు?

ఇల్లందు నియోజకవర్గంలో పెత్తనమంతా అధికార పార్టీ మృగాళ్లదే…
జులై 29 ఇల్లందు నిజం న్యూస్
ఇల్లందులో మహిళలను,మహిళా ప్రజా ప్రతినిధులను లైంగికoగా వేదిస్తున్న గులాబీ నేతలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు…
మొన్న (టీ జీ బీ కే ఎస్) కార్మికనాయకుడు,నిన్న తెరాస పట్టణ అధ్యక్షుడు , నేడు మున్సిపల్ చైర్మన్ ఇలా రోజుకొకరు, ఒకరికంటే మించి ఇంకొకరు…
మహిళలను వేదిoచడంలో గులాబీ దళపతులంతా పట్టభద్రులే,….
యాదరాజా తదా ప్రజా అన్నట్టు మూడేళ్లు గడిచినా ఎమ్మెల్యే ఇంకా తన భర్త కనుసన్నల్లో మెదిలే దుస్థితి కారణంగానే నియోజకవర్గవ్యాపాతంగా మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులకు అధికార పార్టీ మృగాలా మధ్య రక్షణ లేకుండా పోయింది. 60ఏళ్ళు వయసున్న సింగరేణి TGBKS సీనియర్ నాయకుడు ఓ కార్మికుడి భార్యకు ఫోన్ చేసి కల్లోకి వచ్చి కలవరపెడుతున్నావ్ నాకోరిక తీర్చాలని ఇబ్బంది పెడుతుండడంతో , లైంగిక వేధింపులు తాలలేక ఆ కార్మికుడి భార్య ఆ నాయకుడు మాట్లాడిన ఆడియో రికార్డులు బయట పెట్టడంతో ఆ తెరాస నేతను స్థానిక TRS నాయకత్వం TGBKS సంగం నుండే కాక పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేశారు, మళ్ళీ ఇప్పుడు తెరాస పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మరో నాయకుడు వేరొక వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ ఫ్లోర్ లీడర్ భార్య తన కుటుంబసభ్యులతో సదరు మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై దాడికి పాల్పడిన వీడియోలు సామజిక మాధ్యమాలలో హల్చల్ చెయ్యడంతో స్పందించిన తెరాస నాయకత్వం ఆయనతో కేవలం పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి చేతులు దులుపుకుంది మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పదవిని మాత్రం అలాగే ఉంచింది. ఇలాంటి ఘటనలు నియోజకవర్గ ప్రజలు మరువకముందే కామకుడే పాలకుడై మహిళా కౌన్సిలర్లను లైంగికవేధింపులకు గురించేస్తూన్న చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు లీలలు తెరమీదకు తెచ్చిన స్వపక్షం.
చైర్మన్ మహిళా కౌన్సిలర్లను చులక చేసి మాట్లాడ్డం, వారి వార్డులోని పనుల్లో తరచు జోక్యం చేసుకోవడం, కౌన్సిల్ సమావేశంలో వార్డు సమస్యలను ప్రస్థావించకుండా అడ్డుపడడం ఏంటని అడిగితే బైండోవర్ అవ్వండి మీ పనులు త్వరగా అయిపోతాయంటు మహిళా కౌన్సిలర్లను తరచు వేధింపులకు గురిచేస్తూ .. కౌన్సిలర్ల భర్తలకు అనుచరులతో ఫోన్ చేయించి బెదిరింపులకు పాల్పడటం, తిండికి ఠిఖానా లేని వాళ్ళని హేళన చెయ్యడం కౌన్సిలర్లమైనా అయన ముందు కూర్చునే అవకాశం ఇవ్వకపోవడం నాకు నచ్చినట్లు మీరుంటేనే మీ వార్డుల్లో అభివృద్ధి జరుగుతుందనీ వేధిస్తుoడంతో మహిళా కౌన్సిలర్స్ అయనకు నచ్చినట్లు ఉండడమంటే దాని అర్ధం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు చైర్మన్( డీవీ )చేష్టలు శృతిమించడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని మహిళా కౌన్సిలర్లు వాపోయారు. మహిళా ఎమ్మెల్యే ఇలాకాలో ఉన్నామేతప్ప మహిళ కౌన్సిలర్లుగా మాకే రక్షణ లేకంండాపోయిందని
తెరాస పార్టీ విధానాలు నచ్చి
ప్రజలకొరకు పనిచేసేందు ముందుకొస్తే మహిళలను ఇలా వేధింపులకు గురిచేసే దమ్మలపాటి వెంకటేశ్వరరావు వైఖరితో పార్టీ పరువు పోవడమే కాక టీఆరెస్ పార్టీకీ త్రీవ్రనష్టం కలుగుతుందనీ ఈ విషయమై ఆది నాయకత్వం డీవీ పట్ల కఠినంగా వ్యవహరించాలని లేదంటే రాబోయే ఎన్నికల్లో గడ్డు పరిస్థితితులు ఎదుర్కోక తప్పదని వారి ఆవేదన తెలిపారు