జిహెచ్ఎంసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన -గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

జిహెచ్ఎంసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన -గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి..

గచ్చిబౌలి, నిజం న్యూస్, (జులై 28):

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గౌలిదొడ్డి లోని కార్పొరేటర్ కార్యాలయంలో జిహెచ్ఎంసి ఎలక్రిసిటీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని అన్నీ ప్రాంతాల్లో వీధిలైట్ల సమస్య లేకుండా చూడాలని,విద్యుత్ స్తంభాలు ఎలా ఉన్నాయో పరిశీలించి బాగా లేకపోతే కొత్త స్తంభాలు వేయాలని సూచించారు. వీధిలైట్లు వెలిగేలా చూడాలని, వర్షాకాలం అయినందున క్రిమి కీటకాలు, విష సర్పాలు వీధుల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని, అన్ని లైట్లు వెలిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. వీధిలైట్ల పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని,అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఇంద్రదీప్, డీఈ మల్లికార్జున్ రావు, ఏఈ రాజశేఖర్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, కిషన్ గౌలి నవోదయ కాలనీ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు