ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థుల సహకారం మరువలేనిది

ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థుల సహకారం మరువలేనిది

ఎమ్మెల్యే డాక్టర్. గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి, జూలై 28 నిజం న్యూస్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభ్యున్నతి లో పూర్వ విద్యార్థులు పాలుపంచుకోవడం అభినందనీయం తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 19 86, 87 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు సుమారు లక్ష రూపాయల వ్యయంతో, పాఠశాల విద్యార్థుల కోసం ల్యాప్టాప్, టై లు, బెల్టులు, కుర్చీలు బహూకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ తమకు తోచిన విధంగా సహాయం చేయడం శుభ పరిణామమని అన్నారు . ప్రతి విద్యార్థి చదువుకున్న పాఠశాలను మరవ వద్దని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య, గుండ గాని రాములు గౌడ్, శ్రీశైలం యాదవ్, తాసిల్దార్ రామ్ ప్రసాద్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, ప్రధానోపాధ్యాయుడు కొండగడప యాకయ్య, ఉపాధ్యాయులు ఎర్ర హరికృష్ణ, భాస్కర్, కృష్ణవేణి, సోమలక్ష్మి ,రమేష్, మంగమ్మ, పూర్వ విద్యార్థులు కటకం వెంకటేశ్వర్లు ఓరుగంటి సుభాష్, హరికృష్ణ, వెంకటేశ్వర్లు, కటకం కిష్టయ్య, పప్పుల వెంకన్న, అపర్ణ , కలమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.