పోగుల ఆగయ్య నగర్ లో సమస్యలపై బస్తీ బాట

స్మశాన వాటిక కు నిధులు మంజూరు అయిన పూర్తి కాని పనులు..!
చందానగర్, నిజం న్యూస్, (జులై 27):
నాలాల విస్తరణ& కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేయాలని రవి కుమార్ యాదవ్ దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు
చందానగర్ డివిజన్ పోగుల ఆగయ్య నగర్ లో స్థానిక నాయకులతో, ప్రజలతో సమస్యలపై బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ.
నేటి తెలంగాణ ప్రభుత్వం మాటలు తప్ప చేతలకు ఆమడ దూరంలో ఉందని, ఏండ్లు గడుస్తున్నా నిధులు మంజూరై గ్రామంలోని స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం గత ప్రభుత్వ హాయంలో నిధులు మంజూరు చేసిన గాని ఈ చేతగాని ప్రభుత్వం స్మశాన వాటిక పనులను పట్టించుకోకపోగా అక్కడ చెత్త చెదారం చేరి రాత్రి వేళలో విషసర్పాల భయంతో అక్కడి ప్రజలు జీవనం గడుపుతున్నారు అని తెలియజేశారు .
అంతేకాకుండా అధికార పార్టీ నాయకులు నాలాల పై ఇల్లు నిర్మించుకోవడం వలన వర్షపు నీరు డ్రైనేజ్ వాటర్ పోనీ కారణంగా కాలనీ ముంపునకు గురవుతుందని వెంటనే నాలాల విస్తరణ చేపట్టి , ప్రతి రోజు పారిశుద్ధ్యం చెయ్యాలని జిహెచ్ఎంసి అధికారులను కోరడం .అదేవిధంగా స్థానిక ప్రజల అవసరాల కోసం ఒక కమ్యూనిటీ హాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి ,వెంకటేష్, శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి ,రామకృష్ణ, వినోద్ యాదవ్, గణేష్ ముదిరాజ్, బాబు, శ్రీను, రాము మొదలగు వారు పాల్గొన్నారు.