బయన్న వాగు బ్రిడ్జి నిర్మాణం మోక్షం ఎన్న డో??

బ్రిడ్జి నిర్మాణానికి కోట్ల నిధులు మంజూరు చేయాలని రైతుల, గిరిజనుల వేడుకోలు.
సూర్యాపేట ప్రతినిధి, జూలై 27 నిజం న్యూస్.
ఇది ఎక్కడో కాదు… సూర్యాపేట జిల్లా ,తుంగతుర్తి మండలం,గొట్టిపర్తి గ్రామం,గొట్టిపర్తి రైతుల, గిరిజనుల దీన గాధ
గడిచిన కొన్ని సంవత్సరాలుగా, గొట్టిపర్తి రైతులు పొలాలకు వెళ్లాలంటే ఈ బయన్న వాగు దాటుకుని ,అవతలికి వెళ్ళాలి.గొట్టిపర్తి నుండి పోచారం మధ్య బ్రిడ్జి నిర్మాణం గురించి తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ . గాదరి కిషోర్ కుమార్ కి వినతి పత్రం చాలా సార్లు అందజేయడం జరిగింది.అలాగే పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు కూడా ఇవ్వడం జరిగిందని పలువురు వాపోయారు. ఈ న్యూస్ ఫేస్బుక్లో వైరల్ గా మారింది. కానీ ఇంత వరకు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పక్కనున్న సంధ్య తండా, కర్నాల కుంట తండ వాసులకు, రైతులకు వర్షాలు పడప్పుడల ఈ బయన్న వాగు దాటడం సులభతరంగా మారుతుంది.
ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రం నుండి బ్రిడ్జి నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ, బ్రిడ్జి నిర్మాణం నిధులు సమకూర్చడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ సహకారంతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని పేద రైతులు, గిరిజన వాసులు కోరుతున్నారు.