నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎం సహాయ నిధి.!

*నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎం సహాయ నిధి.!û
115 మంది లబ్ధిదారులకు 55లక్షల 29 వేల 500 విలువ గల చెక్కులను పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.
సూర్యాపేట జిల్లా ప్రతినిధి జూలై 26 నిజం న్యూస్.
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా భరోసా కల్పిస్తుందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో మంజూరైన 55లక్షల 29 వేల 500 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 115 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు.
గత ప్రభుత్వాలలో కూడా సీఎం సహాయనిధి ఉండేదని అప్పుడు ఆపదలో ఉన్న వారికి అందరికీ అందేది కాదని అన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పార్టీల కతీతంగా , పైరవీలకు తావు లేకుండా ,ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని పథకాలు అందుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి పథకం నిరుపేదలకు అందుతున్నదన్నారు.
ఈ కార్యక్రమం లో సూర్యాపేట మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీ. ఆర్. ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వి, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారయణ, పట్టణ టీ.ఆర్.ఎస్ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు చాంద్ పాషా, సూర్యాపేట జడ్పీటిసి జీడిబిక్షం, ఎంపిపి రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి, చివ్వెంల మండల ఎంపిపి కుమారి బాబు నాయక్, జడ్పీటిసి సంజీవ నాయక్, మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, పెన్ పహాడ్ జడ్పీటిసి మామిడి అనిత అంజయ్య, మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, ఆత్మకూర్ ఎస్ మండల ఎంపిపి మర్ల స్వర్ణలతా చంద్రా రెడ్డి, మండల అధ్యక్షుడు తూడి నర్సింహ రావ్, పట్టణ కౌన్సిలర్లు గండూరి కృపాకర్, సుంకరి రమేష్, బాషా మియా, రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి, లక్ష్మి మకత్ లాల్, రవి, లింగా నాయక్, ఎలిమినేటి అభినయ్, రంగినేని లక్ష్మణ్ రావ్, జీ. వి రావ్, కడారి సతీష్ యాదవ్, ముదిరెడ్డి సంతోష్ రెడ్డి, కిరణ్, బొమ్మిడి అశోక్, కరుణ శ్రీ, దండు రేణుక, అంజమ్మ,విజయ, ఆయా గ్రామాల సర్పంచ్ లు ,ఎంపిటిసి లు,నేతలు పాల్గొన్నారు..