Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏఎన్ఎం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు నియామకాలను రద్దు చేసిన హైకోర్టు

జిల్లా సంబంధిత అధికారుల పై హైకోర్టు ఆగ్రహం.

హైదరాబాద్ జూలై 25 నిజం న్యూస్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో రాజకీయ నేతల సిఫార్సుతో నిబంధనలకు విరుద్ధంగా అధికారులు చేసిన ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గత ఏడాది జూన్ నెలలో అధికారులు 96 ఏఎన్ఎం పోస్టులను ఎంపిక చేసి, ఎలాంటి టెండర్ల ప్రక్రియను చేపట్టకుండా GO RT NO: 4459 ని అనుసరించి నామినేషన్ / 3 rd పార్టీ పద్దతిలో పై ఉద్యోగాల ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టును నల్లగొండ కి చెందిన శ్రీరామ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీక కెటాయించారు. ప్రస్తుతం ఆ ఏఎన్ఎం లు వారికి కెటాయించిన పి హెచ్ సి లలో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఐతే అధికారులు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టును కెటాయించిన **శ్రీరామ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి* సీనియారిటీ లేదని, పైగా టెండర్ల నిర్వాహణ ప్రక్రియను విస్మరించి నామినేషన్ / 3 rd పార్టీ పద్ధతిలో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టును ఆ ఏజెన్సీకి అధికారులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. ఆ కాంట్రాక్టును రద్దు చేయాలని **నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, సూర్యాపేట* ప్రాంతాలకు చెందిన కొందరు ఏజెన్సీల నిర్వాహకులు హైకోర్టులో రిట్ పిటిషన్ (నెం:6348/2022) దాఖలు చేశారు.

శ్రీరామ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి కాంట్రాక్టు కెటాయింపులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పిటిషనర్ లు, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ రిట్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, శ్రీరామ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అధికారులు నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కాంట్రాక్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్తగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని వెంటనే ఎంపిక చేయాలని.. అప్పటివరకు సదరు ఏజెన్సీని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది

ఈ కేసు విచారణ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదాహరించిన హైకోర్టు.. ప్రభుత్వ/ పబ్లిక్ కాంట్రాక్టుల కెటాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇలా ఏ విధంగా కాంట్రాక్టులు కెటాయిస్తారని అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.