రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న కోతులు

*రేయ్ రండిరా.. చూసుకుందాం..*
*–రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న కోతులు*
*–దత్తప్పగూడెంలో కోతుల గుంపు హల్ చల్*
*–సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో*
యువకులో, ప్రత్యర్థి రాజకీయ పార్టీల కార్యకర్తలో మనస్పర్థలు వచ్చి రెండు గ్రూపులుగా విడిపోయి
కొట్టుకున్నట్టుగా.. కోతుల గుంపు రెండు గ్రూపులుగా విడిపోయి రేయ్ రండిరా చూసుకుందాం..అన్నరీతిలో కొట్లాటకు దిగాయి. ఆ కోతుల గుంపుకు ఏ విషయంలో తేడా వచ్చిందో గాని ఇటో గుంపు అటో గుంపు విడిపోయి కలబడుతూ వీధుల్లో హల్ చల్ చేయడంతో భయంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లి
తలుపులు పెట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో జరిగింది. కోతులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడాన్ని ఆ గ్రామ యువకులు సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. అడవి నుంచి గ్రామంలోకి ప్రవేశించిన సుమారు 200లకు పైగా కోతులు గంటకు పైగా కిష్కిందకాండను తలపించాయి. ఇప్పటికే గ్రామాల్లో
ప్రజలు, వ్యవసాయ బావుల వద్ద రైతులు కోతుల బాధను భరించలేక తలలు పట్టుకుంటున్నారు.