*వరద బాధితులకు ఆర్థిక సహాయం చేసిన కల్లూరి……*

*కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు!!!*

*వరద బాధితులకు ఆర్థిక సహాయం చేసిన కల్లూరి……*
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జూలై 24) నిజం న్యూస్)
భద్రాచలం, ములుగు నియోజకవర్గంలో వరద బాధితులకు పది లక్షల రూపాయల బియ్యం ఉచితంగా అందిస్తున్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి.గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన వరద బాధితులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం లొ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవరాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్,పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ములుగు, భద్రాచలం, రెండు నియోజకవర్గాల్లో పది లక్షల రూపాయల బియ్యం అందిస్తాను అని హామీ ఇచ్చిన ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు కల్లూరి రాం చంద్రరెడ్డి ఈరోజు లారీ లోడ్ చేసి బియ్యం భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పొడిమ్ వీరయ్య గారికి పంపించారు. అక్కడున్న వరద బాధితులు క్షేమంగా ఉండాలని సీతారామచంద్ర స్వామి వారిని కోరుకున్నారు కార్యక్రమంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్,మండల కాంగ్రెస్ నాయకులు, గడ్డమీది యాద గిరి,మదిగే వెంకట స్వామి, ఓర్సు బిక్షపతి,కొండ హరినాథ్,నల్ల బాల కృష్ణ, బాబు,శివ తదితరులు ఉన్నారు.