రూపాయి బిళ్ళ ల తో కేటీఆర్ చిత్రపటం

హైదరాబాద్ జులై 24 నిజం న్యూస్
హైదరాబాద్ రవీంద్ర భారతి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ,స్థానిక రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణంలో రూపాయి బిళ్ళల తో కేటిఆర్ చిత్రపటాన్నీ చిత్రకారుడు విజయ భాస్కర్ చేతులమీదుగా రూపుదిద్దడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తుంగతూర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సెన్సార్ బోర్డ్ మెంబర్ రామకృష్ణను అభినందించారు.
ఈ కార్యక్రమములో డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బాలు, పూర్ణ శశి కాంత్ తదితరులు, పాల్గొన్నారు.