కేశవపురం బంధము లో ఇరుక్కుపోయిన ట్రాక్టరు, ఇరువురిని కాపాడిన స్థానికులు

ఊపిరిపీల్చుకున్న కేశవపురం గ్రామస్తులు.
తుంగతుర్తి జూలై 24 నిజం న్యూస్
గత రెండు రోజుల తరబడి వర్షం కురుస్తుండడంతో, తుంగతుర్తి మండలం ఆవాస ప్రాంతమైన కేశవపురం గ్రామపంచాయతీ ఊరి చివర గల కేశవపురం బంధం వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన టాక్టర్ పై ఇరువురు వ్యక్తులు కలిసి వెలుగుపల్లి వద్దామని వాగు దాటుతుండగా ప్రవాహంలో ట్రాక్టర్ తో సహా ఇరువురు వ్యక్తులు నీటిలో కొట్టు పోతుండగా గమనించిన స్థానికులు తాళ్లు తెచ్చి, నీటిలో వేసి వారిని కాపాడారు. ఏది ఏమైనా స్థానిక సర్పంచ్ మిరియాల అనిత జనార్ధన్ వాగు ఉదృతంగా ఉందని, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంతో ఘటన చోటు చేసుకున్నట్లు, ప్రమాదం నుండి బయట పడడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.