మాముళ్ళ ముసుగులో వ్యవసాయ అధికారులు
మాడ్గులజూలై 22( నిజంన్యూస్ )
మాడ్గుల మండలంలోని వివిధ గ్రామాలలో వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు పూర్తి అవుతుంది ఫర్టిలైజర్, సీడ్స్ షాపులు ఉన్నప్పటికీ వాటిని పర్యవేక్షించే బాధ్యత వ్యవసాయ అధికారులది వారి నిర్లక్ష్యం వల్లనే మండలంలోని వివిధ గ్రామాలలో అధిక ధరలకు మందులు మరియు విత్తనాలు అమ్మి నప్పటికీ వారిపై చర్య తీసుకోకపోవడం వ్యవసాయ దారులలో ఆందోళన కలిగిస్తుంది కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్య తీసుకొని వ్యవసాయదారులు కొన్న విత్తనాలకు మందు బస్తాలకు బిల్లులు ఇచ్చేలా ఫర్టిలైజర్ షాపులకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా మండలంలోని వివిధ గ్రామాల వ్యవసాయదారులు కోరుతున్నారు.