కొడుకు మృతి పై న్యాయపోరాటం -చివరికి బలవన్మరణం

కొడుకు మృతి పై న్యాయపోరాటం …చివరికి బలవన్మరణం
గోదావరిఖని : జులై 22: నిజం న్యూస్
ఎన్టీపిసి మైనారిటీ గురుకుల లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూఫ్ పాఠశాల భవనం పై నుండి మే 15 న రాత్రి పడి మృతి చెందగా తన కొడుకు అనుమానాస్పద మృతి పై మృతుడు తల్లి అజీర అభ్యంతరాలు అనుమానాలు వ్యక్తం చేసింది . గతం లో మీడియా తో మాట్లాడుతూ తన కొడుకు భవనం పై నుండి పడితే ప్రిన్సిపాల్ మంచిర్యాల నుండి వచ్చేవరకు వైద్యం అందించకుండా కళాశాల సిక్ రూమ్ లో ఉంచి వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించారని తనకొడుకు మరణానికి ప్రిన్సిపాల్ నైట్ డ్యూటీ ఆఫీసర్ వార్డెన్ ని బాద్యులు గా పరిగణించి విద్యార్థుల సమక్షం లో విచారణ చేపట్టాలని అధికారులని కోరింది ..తన కొడుకు మృతి పై సమగ్ర విచారణ జరిపేంత వరకు న్యాయపోరాటం కొనసాగిస్తానని పేర్కొంది .తన కొడుకు చనిపోయాక తాను బ్రతికి ప్రయోజనం ఏంటని తనకొడుకు మరణానికి కారణం తెలుసుకోడానికి తాను బ్రతుకుతున్నట్లు కన్నీరుమునీరయ్యారు .. న్యాయం కోసం పోరాడుతూ చివరకి ఈ రోజు బలవన్మరణానికి పాల్పడి మృతి చెందారు ..కాగా రావూఫ్ తండ్రి చిన్నతనం లోనే మరణించగా తల్లి చిన్నచిన్న పనులు చేసుకుంటూ తన కొడుకును పోషించుకుంది. కొడుకు మృతి తట్టు కోలేక తాను బలవన్మరణానికి పాల్పడటం తో ఆ ప్రాంతం లో విషాద ఛాయలు అలుముకున్నాయి