పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ

పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ

ఖమ్మం : ఖమ్మం నగరంలో 2వ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త (Rakesh Datta)  ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసిరెడ్డి సాయి తేజ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సాయం చేస్తున్న రాకేష్ దత్తాను (Rakesh Datta)   అభినందించారు. రాకేష్ దత్తా (Rakesh Datta)  ముందు ముంద కూడా ఇలాగే పేదలకు సహాయ సాకారాలు అందించాలని ఆకాంక్షించారు. నిరుపేదలు, ఆర్థిక పరిస్థితులు బాగలేక చదువుకోవటానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు రాకేష్ దత్తా (Rakesh Datta)  లాగా సాయం చేయటానికి యువకులు, ప్రముఖులు ముందుకురావాలన్నారు. అనంతరం రాకేష్ దత్తా (Rakesh Datta)  మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సాయం చేయటం తనకు ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలిదు, జగన్, మైనారిటీ నాయకుడు షేక్ మథర్, వరగని రమేష్, బీసీ గొనె శ్రీశ్రీ, రమేష్, సుధాకర్, చింతల రోహిత్, రేవంత్, ఉప్పి, గోపి, బంటీ యువత, తదితరులు పాల్గొన్నారు.