Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆస్తి కోసం కొడుకే హత్య చేసాడా?

మాజీ ఎంపీటీసీ వత్సవాయి మల్లయ్య హత్య

మృతదేహం స్థలంలో విచారణ జరుపుతున్న పోలీసులు…. పరారిలో కుమారుడు.

ఆత్మకూర్ఎస్ జులై 21 (నిజం న్యూస్):

మండల పరిధిలోని ఏనుబాముల గ్రామంలో అనుమానాస్పద స్థితి లోమాజీ ఎంపీటీసీ వత్సవాయి మల్లయ్య 61. బుధవారం రాత్రి హత్యకు గురైయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మల్లయ్యను ఇంట్లో నిద్రిస్తున్న అతని పై కత్తి తో కిరాతకంగా ముఖం కళ్ల పై దారుణంగా పొడిచి హత్య చేశారు. గ్రామానికి చెందిన మల్లయ్య మిత్రుడు ఇద్దయ్యతో కలిసి గ్రామం లో 4ఎకరాల పొలం కౌలు తీసికొని సాగు చేస్తున్నారు. మిత్రుడు ఇద్దయ్య ఈ రోజు పొలం పనులకు వెళ్లేందుకు మల్లయ్య ఇంటికి తెల్లవారు జామున వెళ్లగా మల్లయ్య హత్య కు గురై రక్తపు మడుగులో ఉండడం తో చుట్టుపక్కల వారికి పోలీస్ లకుసమాచారం ఇచ్చారు. కుమారుడు నరేష్ రాత్రి వరకు ఇంట్లో ఉండి తెల్లవారు జామునతన ఇంటిరూము కు తాళం వేసి ఉండడం తో కొడుకే హత్య చేసి పరారయి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని హత్య కు కారణాలను సేకరిస్తున్నారు. కొడుకు నరేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం మరికొంత అనుమానాలకు దారితీస్తుంది.. తండ్రి కొడుకుల కు ఈ మధ్య భూమి విషయం పై పెద్దలసమక్షంలో పంచాయతీ జరిగినట్లు సమాచారం. మల్లయ్య కున్న 1.20ఎకరాల భూమి ని కొడుకు నరేష్ సాగు చేసుకోవాలని ఒక వేల కొడుకుకు పట్టాచేస్తే కొడుకు తండ్రి కి 7లక్షలు రూపాయలు ఇచ్చే లా తీర్మానం చేసినట్లు తెలిసింది. మృతుడు మల్లయ్య కు మొదటి భార్య మృతి చెందగాఆమెకు ఒక కొడుకు కూతురు ఉన్నారు ఇద్దరికి పెళ్లి అయ్యింది. భార్య మృతి చెందడం తో మల్లయ్య రెండవ పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య కు ఒక కొడుకు పుట్టాక భార్య కు విడాకులు ఇవ్వడం తో కొడు�