స్కౌట్ విద్యార్థులకు కవితక్క సహకారం తో క్రీడా సామాగ్రి అందజేత

స్కౌట్ విద్యార్థులకు కవితక్క సహకారం తో క్రీడా సామాగ్రి అందజేత
ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్.
హైదరాబాద్, జులై 21 నిజం న్యూస్
గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్. జన్మదినం సందర్బంగా స్పోర్ట్స్ ఛైర్మెన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి అద్వర్యంలో స్కౌట్స్ దోమలగూడ లోని అండ్ గైడ్స్ స్కూల్ లోని విద్యార్థిని విద్యార్థుల కోసం కబ్బడ్డి ,ఖోఖో ,టెన్నికాయిట్ ,చెస్ ,అథ్లెటిక్స్ ,త్రోబాల్ విభాగాలలో 3 రోజులు క్రీడలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంస్థకు కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత 7సంవత్సరాలుగా ఉండి ,ఆ పిల్లలకు కావలసిన వసతులు అన్ని చూసుకోవడం జరుగుతుంది . విద్యార్థులకు టీ షర్ట్ తో పాటు, క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సెక్రటరీ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.