ధరల పెరుగుదలపై ఢిల్లీలో నిరసన చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు

న్యూఢిల్లీ జులై 19 నిజం న్యూస్.
మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం తో కలిసి నిరసన తెలియజేసిన రాజ్యసభ ఎం.పి.బడుగుల లింగయ్య యాదవ్ తో పాటు, జోగినిపల్లి సంతోష్ కుమార్, కే.కే , మాలోత్ కవిత, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.