లింగమంతుల స్వామి గుడి లో చోరీ

తిరుమలగిరి జూలై 18 నిజం న్యూస్
తిరుమలగిరి మండలం తొండ గ్రామం లో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు బోడ గుట్ట మీద ఉన్నటువంటి లింగమంతుల స్వామి గుడి తాళాలు పగులగొట్టి స్వామి వారి మెడలో ఉన్నటువంటి 5 వెండి గొలుసులను అపహరించారని స్థానికులు తెలిపారు. దాదాపుగా ఒక్కొక్క గొలుసు కనీసం ఐదు తులాల ఉంటుందని గ్రామ యాదవులు తెలిపారు.
యాదవులు ఎంతో పవిత్రంగా కొలిచే లింగమంతుల స్వామి గుడి లో చోరీ జరగడం చాలా బాధాకరమని,
చోరీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని యాదవ సంఘం నాయకులు కోరారు.
ఈ విషయమై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు శివ శంకర యాదవ్, ఈ రెంటి యాక స్వామి, లింగయ్య, నరసింహ, యాదగిరి, రాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.