కేటీఆర్ కప్ 20- 20 కి 50 వేలు ఎమ్మెల్యే అందజేత

తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.
హైదరాబాద్ జులై 18 నిజం న్యూస్
ఈ నెల 24వ తారీఖు న టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్ర మున్సిపల్ & ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఉస్మానియా యూనివర్సిటీ టి ఆర్ ఎస్ వై, టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించిన కేటీఆర్ కప్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన
రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ , తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ , షార్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ కప్ 20-20 నిర్వహణకు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు తన వంతు సాయంగా ₹50,000/- (యాభై వేల రూపాయలు) కమిటి సభ్యులకు అందజేశారు.