సర్వేనెంబర్ 199 లో అక్రమ పట్టాలను రద్దు చేయాలి

సర్వేనెంబర్ 199 లో అక్రమ పట్టాలను రద్దు చేయాలి

సివిల్ కోర్టు భవనానికి స్థలాన్ని మంజూరు చేయాలని ధర్నా.

బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్.

తుంగతుర్తి జులై 18 నిజం న్యూస్

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని 199 సర్వే నెంబర్ల గల అక్రమ పట్టా కలిగిన 6 ఎకరాల ప్రభుత్వ భూమిని తుంగతుర్తి లోని సివిల్ కోర్టు భవన నిర్మాణానికి మంజూరు చేయాలని తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నేపర్తి జ్ఞాన సుందర్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ సందర్భంగా అన్నేపర్తి జ్ఞాన సుందర్ మాట్లాడుతూ… సర్వేనెంబర్ 199 లోని 6 ఎకరాల 22 గుంటల ప్రభుత్వ భూమిని అక్రమంగా కాసులకు కక్కుర్తి పడి ఇతరులకు పట్టా చేశారని ఆరోపించారు. అట్టి భూమి పట్టాలను రద్దుచేసి కోర్టు భవన నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

అనంతరం తహసిల్దార్ రాంప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కాపూరి శ్రీకాంత్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పెద్ద బోయిన అజయ్ కుమార్, కొండరాజు, సతీష్ సోమలింగం దయాకర్, అశోక్, సోమాచారి ,తదితరులు పాల్గొన్నారు.