Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అయోమయంలో భూదాన్ భూమి

జూలై 17 (నిజం న్యూస్ ) : భూదాన్ భూములు జిల్లాలోని పలు మండలాలలో అయోమయంలో ఉన్నాయి ఇటీవలికాలంలో మాడుగుల మండలం ఇర్విన్ రెవిన్యూ పరిధిలో కోట్ల విలువ చేసే భూదాన్ భూమిని స్థానికంగా ఉన్న కొంతమంది అధికార పార్టీ నాయకులు ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది ఈ భూమి వ్యవహారంపై గ్రామానికి చెందిన కొంతమంది యువకులు రెవెన్యూ అధికారులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. *ఎటూ తేల్చని భూదాన్ భూమి వివరాలు*: ఇర్విన్ గ్రామ ఆమ్లెట్ విలేజ్ అయినా రెడ్డి పురం పరిధిలోని సర్వే నెంబర్ 338 /7లో ఒక ఎకరా ఎనిమిది గుంటలు, సర్వే నెంబర్ 339 లో మూడు ఎకరాల 36 గుంటలు ఈ భూమికి సంబంధించిన సమాచారం ఏమి తెలియకపోవడంతో అటు ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు ఇటు గ్రామ యువకులు అయోమయంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భూదాన్ భూమిని కాపాడాలని ఇర్విన్ గ్రామ యువకులు కోరుతున్నారు.