యువకుడి పై సోడా  సీసాలతో దాడి 

అంతర్గం:జులై 16:నిజంన్యూస్

అంతర్గావ్ మండల కేంద్రంలో లోకిని

దేవేందర్ ని అదే గ్రామానికి చెందిన సర్పంచ్ కొడుకు సోడా సీసాలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు .

బాధితుని గ్రామానికి సంబంధించిన యువకులు హుటాహుటిన తీవ్ర రక్తస్రావం అవుతూ ఉండడంతో గోదావరిఖని లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిచారు . కాగా గాయపడిన యువకుడు దాడి చేసిన యువకుడు

గతంలో స్నేహితులు కొన్ని రోజులుగా మనస్పర్ధలు రావడంతో తనతో చనువుగా ఉండటం లేదని కక్ష పెంచుకుని నిన్న

సాయంకాలం షాపుకు దేవేందర్ వెళ్లగా సందర్భం

లేకుండా కల్పించుకొని మాటల దాడి చేసి చేతిలో ఉన్న సోడా సీసాతో దాడి చేసాడు అని బాధితుడు తెలిపాడు .దేవేందర్ తలకి పది కుట్లు వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు ప్రస్తుతం దేవేందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది