ప్రేమించడం లేదని యువతి గొంతు కోసిన బంధువు

నిజామాబాద్ జులై 16, (నిజం న్యూస్):
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని యువతి గొంతును ఆమె బంధువే కోసిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ALSO READ: కారు ఢీకొని వ్యక్తి మృతి . తుంగతుర్తి లో అలుముకున్న విషాదఛాయలు
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మోపాల్పాల్ మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి మాక్లూర్ మండలం మాణిక్ బండారు చెందిన సుంకరి సంజయ్ కుమార్ దూరం బంధువు. అయితే సంజయ్ తనను ప్రేమించాలని యువతిని కొంతకాలంగా వేధిస్తున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతీ ఇంటికి వచ్చిన సంజయ్ ఆమెతో గొడవపడి గొంతు కోశాడు. యువతి రోడ్డుపైకి వచ్చి అరుపులు, కేకలు వేయడంతో సంజయ్ పరారీ అయ్యాడు. సంఘటనను గమనించిన స్థానికులు యువతిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా మోపాల్ పోలీసులు సంజయ్ ని శనివారం అరెస్టు చేశారు.