కారు ఢీకొని వ్యక్తి మృతి . తుంగతుర్తి లో అలుముకున్న విషాదఛాయలు

గతంలో కూడా పోలుమల్ల వద్ద హైవేపై పలు ప్రమాదాలతో భయాందోళనలు.
తుంగతుర్తి జూలై 16 నిజం న్యూస్
కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామం వద్ద నేషనల్ హైవే 365 పై కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుంగతూర్తి మండల కేంద్రానికి చెందిన వడ్లకొండ పూర్ణయ్య 46 , యధావిధిగా నూతనకల్ లోని ఓ వైన్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి వైన్ షాప్ బందు చేసిన అనంతరం తిరిగి తుంగతుర్తి కి తన బైక్ పై వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో, నేషనల్ హైవే పై, వెనక నుండి స్పీడ్ గా వచ్చిన కారు ఢీ కొట్టగా, ఒక్కసారి కారు టైరు పగిలి ,అంతే స్పీడ్ తో బైక్ ను ఢీ కొట్టగ పూర్ణయ్య తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీనితో స్థానికులు వైన్స్ యాజమాన్యాలకు పోలీసులకు తెలపగా ఆర్ సంఘటన స్థలానికి చేరుకొని పూర్ణయ్య చనిపోయినట్లు నిర్ధారించి , వారి కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలియపరిచారు. దీనితో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకొని, మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. కారు ఢీ కొట్టిన వ్యక్తి కారును వదిలేసి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఆ వ్యక్తి కోసం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనితో తుంగతుర్తి మండలంలో అందరికీ సుపరిచితం వ్యక్తి పూర్ణయ్య కావడంతో దవాఖానాలు రోదనలు మిన్నంటాయి పూర్ణయ్యకు భార్య ,కుమారుడు, కూతురు ఉన్నారు.