వరదల్లో నష్టపోయిన ప్రతి బాధితుని ప్రభుత్వం ఆదుకోవాలి

పేదల పెన్నిధి ములుగు శాసనసభ్యు రాలు సీతక్క.

తనకు తోచిన విధంగా పేద గిరిజన కుటుంబాలకు తక్షణమే సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే.

వర్షాన్ని లెక్కచేయకుండా, నీటి వరద లో నడుస్తూ నేనున్నా అని సహాయం చేస్తున్న మహిళా ఎమ్మెల్యే.

ములుగు జులై 15 నిజం న్యూస్

ఇవ్వి మా బ్రతుకులు. వరద నీటితో అన్నీ కోల్పోయి దీన స్థితిలో ఉన్న గిరిజనులకు నేనున్నానని భరోసా కల్పిస్తున్న మహిళా ఎమ్మెల్యే సీతక్క

ప్రభుత్వం అనేది బతికుంటే వరదల ద్వారా నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మాట ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ కట్టివ్వాలి…

పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కోరారు.

వరదల్లో నష్టపోయిన బాధితుల ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మానవతా హృదయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.