భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- ఎస్ఐ ఎం డి ఇద్రిస్ అలీ

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జూలై 11(నిజం న్యూస్)
ఎడ తెరిప లేకుండా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ ఎం డి ఇద్రిస్ అలీ తెలిపారు.మరో రెండు,మూడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించగలరు.పాత మట్టి గోడలో ఇళ్లల్లో ఉండరాదని కూలే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు ఎలక్ట్రిక్ షాక్ వచ్చే అవకాశం ఉన్నందున వాటిని తాకరాదు. రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలోను స్టార్టర్లు బాక్స్, ఫ్యూజ్ బాక్స్ తాకరాదు. వాగులు,కాలువలు వరద ప్రవాహంతో ఉన్నందున వాటిని దాటేందుకు ప్రయత్నించరాదు. అవసరమైతేనే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.తీవ్ర వర్ష ప్రభావం ఉన్నందున పిల్లలు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి.నీటిలో ఆడేందుకు సరదాగా వెళ్లి ప్రమాదశాత్తు బారిన పడే అవకాశం ఉన్నందున పిల్లలు అప్రమత్తంగా ఉండాలి.నీటిలో నిండి ఉన్న చెరువులు,కాలువలు చూసేందుకు వెళ్లరాదు.అందులో ఆటలాడరాదు వర్షం నీటితో తడిసి ఉండడంవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.ఏదైనా అత్యవసరం ఉన్నట్లయితే డయల్ 100, పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పలు సూచనలతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు.