పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో పట్టపగలే చోరీ

చర్ల జూలై 8 (నిజం న్యూస్) చర్ల మండలంలోని గొమ్ముగూడెం పంచాయతీలో గల పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో పట్టపగలే ఒంటిగంట కుండ పోత వర్షంలో ఆలయంలో చోరీ జరిగింది అర్చకులు ప్రసన్న కుమార్ 12 గంటల వరకు ఆలయంలో పూజలు నిర్వహించుకొని ఇంటికి వెళ్లిపోయిన సమయం చూచి దుండగులు ఈ చోరికి పాల్పడ్డారు.

ALSO READ: 11 వరకు వర్షాలు… బయట కాలు పెట్టొద్దు

ఆలయంలోని సీతమ్మ వారి మెడలోని రెండు మంగళ సూత్రాలు. చటారిలోని కొంత నగదు.. హుండీలోని నగదును తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డాడు. సర్పంచ్ పోడియం మురళి అక్కడికి వచ్చి పరిశీలించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ప్రసన్న కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు