11 వరకు వర్షాలు… బయట కాలు పెట్టొద్దు

జీలుగుమిల్లి జులై 8 (నిజం న్యూస్)

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.

8 వ తేదీ నుంచి అంటే శుక్రవారం నుంచే వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఈ నెల 11వ తేదీ వరకు వర్షాలు ఆగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది వాతావరణ శాఖ. ఈనెల 9వ తేదీన తెలంగాణ లో అతి భారీ వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా హెచ్చరించింది. హైదరాబాదులో సాధారణ వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి వీధుల్లోకి వర్షపు నీరు వరద కాలువ లాగా పొంగి పొర్లుతుంది అంటే ఈనెల 9వ తేదీ హైదరాబాద్ లో ఎవరు కాలు బయట పెట్టొద్దు అని చెప్పినట్టే.

భారీ వర్షాలకు తుఫాన్ లేదా అల్పపీడనం కారణం కాదు కేవలం నాయుడు తీరు పవనాల వల్లే ఈ వర్షాలు కురుస్తాయి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న కారణంగా ఆవర్తనం ఏర్పడిందని దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు వివిధ రాష్ట్రాలలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నాలుగు రోజులు ఏపీ తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఇవి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

నైరుతి రుతుపవనాల కారణంగా ఏర్పడిన ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, ఎత్తునుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని చెబుతున్నారు. ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో ఇది తూర్పు పశ్చిమ జోన్ లో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతం పరిసరాలలో ఏర్పడిన వాయుగుండం ఛత్తిస్ ఘడ్ తీరాన్ని తాకింది దీని ప్రభావం కూడా మరింత ఉంటుందని చెబుతున్నారు.

రాగల ఐదు రోజుల్లో ప్రదేశ్ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. కోస్తాంధ్ర లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఈ నెల 8 ,11 తేదీల్లో కోస్తాంధ్ర తెలంగాణ యానంలో అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని, ఇప్పటికీ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అక్కడక్కడ చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ ఈ వడలు మరో ఐదు రోజులు పాటు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుంది. దీంతో ప్రజలు బయటికి వచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.