సర్కారు వారి భూమి 10 లక్షలకు అమ్ముతున్నారు..?

సర్కారు వారి భూమి 10 లక్షలు

*- ప్రజాప్రతినిధులే ప్రభుత్వ భూమి కబ్జా…*

*- తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వభూమిని అమ్మిన వైనం…*

*- ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం…*

*- టిఆర్ఎస్ పార్టీ నాయకులే భూ కబ్జాలు…*

*- కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి,శంకర్ నాయక్…

*భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8 (నిజం న్యూస్)*

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గురజాల గోపి,రాష్ట్ర నాయకుడు శంకర్ నాయక్ లు అన్నారు. గురువారం మండలంలోని గుట్టమల్లారం గ్రామంలో పత్రిక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా నాయకులు మాట్లడుతూ…గుట్టమల్లారం గ్రామంలోని స్థానిక సర్పంచ్,ఎంపీటీసీ ఇద్దరు కలిసి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వారు ఆరోపించారు. గౌరవ కోర్టులను తప్పుదారి పట్టించి ప్రభుత్వభూమిపై తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని సుమారు 10లక్షలకు మండలంలోని ఓవ్యక్తికి అమ్మివేశారని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జా చేశారని స్థానిక గిరిజనులు ప్రశ్నిస్తే స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ ఇద్దరు కలిసి అధికార పార్టీ బలంతో పోలీసుల సహకారంతో అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని వారు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూములను కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నాయకులే కబ్జాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వభూమి కబ్జా కాకుండా అడ్డుకున్నవారిని, ప్రశ్నించిన వారిపై ఏ విధంగా కేసులు పెడతారని ఘాటుగా ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి కబ్జాల పాలు కాకుండా పేద గిరిజన ప్రజలకు కేటాయించాలని ఈసందర్బంగా డిమాండ్ చేశారు. గిరిజనులపై అక్రమ కేసులు పెడితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఈ సందర్బంగా హెచ్చరించారు. ప్రభుత్వ భూములకు,గిరిజన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జా విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఈసందర్బంగా తెలిపారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు బుర్గుల నరసయ్య,జానపాటి వేణు,షరీఫ్,సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు.