మొన్న కాంగ్రెస్ – నిన్న తెరాస – నేడు కాంగ్రెస్

నిన్న అక్కడ – నేడు ఇక్కడ
-గంటకో జెండా
-పూటకో పార్టీ
-ఇదేమి చిత్రం
-ఇదేమి రాజకీయం
-పరేషాన్ అవుతున్న నేరేడుచర్ల ప్రజలు
నేరేడుచర్ల,జూలై 04 (నిజం న్యూస్) తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు కేంద్ర బిందువుగా నేరేడుచర్ల మారింది ఒక పూట పార్టీ జంపులు మరొక పూట బుజ్జగింపులు వెంటనే సొంతగూటికి ఈ పరిణామాలు చూస్తున్న ప్రజలు ఈ రాజకీయాలు మేము ఎన్నడూ చూడలేదు అంటూ విస్తుపోతున్నారు.
ఆదివారం కాంగ్రెస్ కౌన్సిలర్ నాగయ్య టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు సోమవారం ఉదయాన్నే సొంతగూటికి చేరారు ఈ రాజకీయాలు ఎటు నుంచి ఎటు వైపు వెళ్తాయని నేరేడుచర్ల ప్రజలు పరేషాన్ అవుతున్నారు