తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మేడే రాజీవ్ సాగర్ నియామకం

హైదరాబాద్ జూన్ 30 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు మే డే రాజీవ్ సాగర్, తెలంగాణ రాష్ట్ర సమితి అభివృద్ధిలో కృషిని గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా, నియామక పత్రం అందించడం పట్ల, ముఖ్యమంత్రికి కెసిఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేషన్ చైర్మెన్గా మే డే రాజీవ్ సాగర్ నియామకం పట్ల ఈ ప్రాంత ప్రజలు, నాయకులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.