విద్యుత్ తీగలు తెగి పడి 8 మంది అక్కడికక్కడే సజీవ దహనం

విద్యుత్ తీగలు తెగి పడి 8 మంది అక్కడికక్కడే సజీవ దహనం*
శ్రీ సత్యసాయి జిల్లా జూన్ 30 (నిజం న్యూస్ )
ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిన్న కొండయ్యపల్లి లో ఘోర విషాదం చోటు చేసుకుంది ప్రయాణికులతో వెళుతున్న ఆటో పై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి ఆటోలో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తున్న ఎనిమిది మంది మృతి చెందగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కన్నీరుమున్నీరుగా విల పిలిపించారు మృతులను గడ్డం పల్లి వాసులుగా గుర్తించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది