హైస్కూల్ కు తాళాలు వేసిన విద్యార్థులు

హై స్కూల్ కు తాళాలు వేసిన విద్యార్థులు

బోనకల్ మండలం, జూన్ 29 నిజం న్యూస్

గోవిందపురం (యల్) జడ్ పి ఎస్ ఎస్ హై స్కూల్ కు తాళాలు వేసిన విద్యార్థులు. స్కూలు ప్రారంభం నాటి నుండి ఇంతవరకు మాకు టీచర్ల కొరత ఉండటం వలన, మాకు టీచర్లను భర్తీ చేయలేదని, మేము పాఠశాలకు వచ్చేది మధ్యాహ్న భోజనం అన్నం తింటానికి వచ్చి పోవాలా అని విద్యార్థులు వాపోతున్నారు, వెంటనే మా స్కూల్ కి ప్రభుత్వ టీచర్ల భర్తీ చేసి మేము చదువుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించాలని, పిల్లలు రోడ్డుపై స్కూల్ గేట్ దగ్గర పిల్లలు మరియు పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ కారంగుల లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ ఉమ్మినెని బాబు, మాజీ చైర్మన్ లక్ష్మణ్, వైఎస్సార్ పార్టీ నాయకులు ఇరుగు జానేష్, సిపిఎం నాయకులు ఉమ్మినేని రవి, కళ్యాణ్ శ్రీనివాసరావు ,ఆందోళనలో పాల్గొన్నారు, కారంగుల లక్ష్మణ్ యస్ ఎం సీ, చైర్మన్ మాట్లాడుతూ పెద్ద అధికారులకు వినతి పత్రం ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మా ప్రభుత్వ పాఠశాల గురించి ఎవరూ పట్టించుకోలేదని మా పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని మేము ఆందోళన చేయాల్సిన అవసరం వచ్చిందని తెలియజేసినారు, గ్రామ సర్పంచ్ బాబు మాట్లాడుతూ గ్రామంలోని పేద మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు డబ్బు ఖర్చు పెట్టలేక, ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు, పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు టీచర్లు లేకపోతే, పప్పు చారు అన్నం తినడానికి విద్యార్థులు వచ్చేది చదువుకోడానికా. ఇప్పటికైనా ప్రభుత్వ టీచర్లను భర్తీ చేయాలని వారన్నారు ధర్నాను ఉద్దేశించి, నిజం రిపోర్టర్ డీఈఓ వివరణ కోరగా ప్రభుత్వ ప్రకారం మేము ఫాలో అవుదామని అన్నారు, మండల విద్యాశాఖ అధికారిని ఇంద్రజ్యోతి ని, ఆందోళన దగ్గరకు పంపిస్తానని తెలియజేసినారు ,

సుమారు గంటసేపు ధర్నా చేసిన తర్వాత బోనకల్ మండల ఎంఈఓ ఇందిరా జ్యోతి, పాఠశాలకు వెంటనే ప్రభుత్వ టీచర్లను జులై 15 లోపు బదిలీ చేస్తామని హామీ ఇచ్చినారు తర్వాత పిల్లల పాఠశాల తాళాలు తీసి తమ తమ తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు