నారాయణ స్కూల్ ముందు విద్యార్థి సంఘం ఆందోళన

స్కూల్ పై దాడికి దిగిన విద్యార్థి సంఘం నేతలు, ఫర్నిచర్ ధ్వంసం

రంగంలోకి దిగిన పోలీసులు,పరిస్థితి ఉద్రిక్తం.

విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.

సూర్యాపేట ప్రతినిధి జూన్ 22 నిజం న్యూస్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నారాయణ స్కూల్ ఎలాంటిఅనుమతులు లేకుండా నడిపిస్తున్నారని ఆరోపిస్తూ పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు
నేతలు స్కూల్ లోకి చొచ్చుకొనిపోయి దాడికి దిగడంతో స్కూల్ లో ఫర్నిచర్ ధ్వంసమైంది.దీనితో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఎట్టకేలకు పోలీసులువిద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. పి.డి.ఎస్.యు నాయకులు మాట్లాడుతూ గతంలో బేబీ మూన్ స్కూల్ పేరుతో నడిచిన భవనంలో స్థానంలో ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణ స్కూల్ నడపడం జరుగుతుందని అన్నారు.

Also Read:ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన తమిళనాడుకు చెందిన వ్యక్తి

గత సంవత్సరం నుండి కూడా నారాయణ స్కూల్ కు పర్మిషన్ రాకుండా బేబీ మూన్ హైస్కూల్ భవనంలో నారాయణ స్కూల్ పేరుతో విద్యార్థుల వద్ద అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థులను మోసం చేస్తున్న నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యాశాఖ అనుమతులు లేకుండా నారాయణ స్కూల్ ఎలా నడుస్తుందో విద్యా శాఖ అధికారులకే తెలియాలని,నారాయణ పేరుతో పిల్లల తల్లిదండ్రుల అధిక మొత్తంలో ఫీజులు గుంజుతుంటే అధికారులు ఎందుకు మొద్దు నిద్ర పోతున్నారని,చట్ట విరుద్ధంగా స్కూల్ నడుపుతున్న వారిని వదిలేసి,న్యాయం చేయాలని అడుగుతున్న విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు…